నేటితో తేలిపోనుంది ఎవరు ఫైనల్ …? ఎవరు ఇంటికి వస్తారో…? ఓవల్ వేదికగా జరిగే ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం ఫైనల్ లో పాకిస్థాన్తో తలపడి కప్ సాధించుకుంటుంది. మరీ ఇరు జట్ల గత చరిత్రను ఒక సారి చూసేద్దామా..
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఇంగ్లండ్ ఇప్పటివరకు 22సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 12సార్లు గెలవగా ఇంగ్లండ్ 10సార్లు నెగ్గింది. అయితే టీ20 ప్రపంచకప్ లో ఇరుజట్లు కేవలం మూడుసార్లు మాత్రమే తలపడ్డాయి. అందులో భారత్ రెండు సార్లు గెలవగా ఇంగ్లండ్ ఒక సారి నెగ్గింది.
2007 సెప్టెంబర్ 19న డర్బన్ వేదికగా జరిగిన తొలిమ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 218/4 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగి 200/6పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లోనే యువరాజ్‌సింగ్ విశ్వరూపం చూపించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించాడు. 12 బంతుల్లోనే అర్దశతకం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
2009లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 7వికెట్ల నష్టానికి 153పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కేవలం150/6పరుగులు చేసి 3పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
2012లో జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత్ 90పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 170/4పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 14.4ఓవర్‌లో 80పరుగులు చేసి ఆలౌటైంది.
ఇక రేపటితో తేలిపోనుంది కాగా ఒకవేళ భారత్ గెలిస్తే దాయాది జట్టుతో ఇది రెండో ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. 2007లో జరిగిన మొదటి ప్రపంచకప్ లో ఫైనల్ లో భారత్ గెలిచి తొలి కప్‌ను అందుకుంది. ఇదే సీన్ మరోసారి రీపిట్ కావాలని ఆశిద్దాం.. ఆదివారం నవంబర్13న జరిగే ఫైనల్ పోరులో రేపు గెలిచే జట్టుతో పాక్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి..
దాయాది జట్టు ఫైనల్‌కు చేరింది..
ఎమ్మెల్యేల కొనుగోలుపై సిట్ ఏర్పాటు
ప్రధాని పర్యటనపై అగ్రహాజ్వాలలు