Tomato:సెంచరీ కొట్టిన టమోట..

39
- Advertisement -

రోజురోజుకు ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు,పెట్రోల్ ధరలకు తోడు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా టమోట ధరలు ఆకాశాన్నంటాయి. ఏకంగా కేజీ టమోట రూ.100 మార్క్‌కు చేరింది.

30 కిలోల టమోటా బాక్స్ ధర 3 వేల రూపాయలు పలుకుతోంది. మేలిమి రకం టమోటా కిలో వంద రూపాయలకు చేరడం‌తో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ధరల ప్రభావం మరో 15 రోజుల వరకు ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

Also Read:CM KCR:శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇక రోజువారి కూరల్లో టమోటా తప్పనిసరి. ఎందుకంటే టమోటోలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరం యొక్క వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్రని, పండిన, పచ్చి టమోటాలో A, C, K విటమిన్లు, ఫోలేట్, పొటాషియంని కలిగి ఉంటుంది. టమోటాలు సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కాలరీలను తక్కువగా కలిగి ఉంటాయి.టమోటోలు మొటిమలు మచ్చలు నివారించడానికి ఒక నేచురల్ హోం రెమెడీ గా పని చేస్తుంది.

Also Read:మొక్కజొన్న పీచుతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -