డ్రగ్స్ కేసు: ఆ టాప్‌ సినీ ప్రముఖులు వీరేనా..?

175
Tollywood under drugs glare, vigil on heroines
Tollywood under drugs glare, vigil on heroines
- Advertisement -

డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్‌కి లింక్‌ ఉండటంతో తెలుగు సినీ రంగం పరువు మొత్తం గంగలో కలిసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన 10 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక స్టంట్ మాస్టర్ ఉన్నారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఆ 10 మంది ఎవరనే పేర్లు మాత్రం వెల్లడించలేదు. వీరంతా ఆరు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. పరిశ్రమకు చెందిన పలువురికి నోటీసులు జారీ అయ్యాయనే వార్తలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.

తాజాగా పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వారి బయోడేటాలు ఇలా ఉన్నాయి. బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించి హీరోగా విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రస్తుతం చేతుల్లో సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న ఓ యువనటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇతనితో పాటు ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు, అలాగే సినిమా ఫంక్షన్లలో హీరోలను పదేపదే పొగిడే ఓ నిర్మాతకు, సినిమాల్లో బ్రేక్ లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడికి కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

అమెరికా నుంచి వచ్చి తొలుత హిట్ చిత్రాల్లో నటించి, ఆపై ప్రస్తుతం అడపాదడపా కనిపిస్తున్న నటుడికి, సినిమాలు వేగంగా తీస్తాడని పేరు తెచ్చుకున్న ఓ టాప్ డైరెక్టరు ఈ జాబితాలో ఉన్నారు. నేడు నోటీసులు అందుకున్న హీరోయిన్లలో… అటు టీవీ తెరపై, ఇటు వెండి తెరపై రాణిస్తున్న ఓ నటి, అటు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు స్టేజ్ షోలు, న్యూ ఇయర్ పార్టీల్లో సందడి చేస్తుండే నటి, డైరెక్టర్లతో క్లోజ్ గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చూసే ఓ హీరోయిన్ ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నోటీసులు వెళ్లిన సినీ ప్రముఖులు సిట్ ముందు హాజరు కావాల్సిందేనని ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. తాజాగా మరో ముగ్గురి హీరోయిన్లకు నోటీసులు జారి చేశామని.. సినీ ప్రముఖుల చిట్టా ఇంకా పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. ఎక్సైజ్ శాఖ లిస్టులో మరికొందరు సినీ తారలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ మొత్తం 15 మంది సినీ స్టార్లకు నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.

- Advertisement -