దసరా తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు ఈ వారం నాలుగు చిన్న సినిమాలు రానున్నాయి. ఇందులో ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది సీక్వెల్‌గా రాజుగారి గది 3 రానుండగా వీటితో పాటు రాగల 24 గంటల్లో మళ్లీ మళ్లీ చూసా, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.
()రాజుగారి గది 3
బుల్లితెరపై పాపులర్ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి రాజు గారి గది సీక్వెల్స్‌తో మంచి పాపులర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఈ సీరిస్‌లో ఇప్పుడు రాజు గారి గది 3 సినిమా తెరకెక్కించిన ఓంకార్ ఈ సినిమా హిట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
()ఆపరేషన్ గోల్డ్ ఫిష్
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. సెన్సిబుల్ సినిమాలు ‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’తో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
()మళ్ళీ మళ్ళీ చూశా
కంటెంట్ బాగుండి సరైన పద్దతిలో ప్రమోషన్ చేస్తే సినిమా చిన్నదా పెద్దదా అన్నది చూడట్లేదు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో ఈ రకంగా సూపర్ హిట్ సాధించిన ఎన్నో చిన్న చిత్రాలను మనం చూసాం. అదే కోవలో తెరకెక్కిన చిత్రం “మళ్ళీ మళ్ళీ చూశా”.
జీవితంలో అందరూ కోరుకునే ప్రాధమిక హక్కు స్వేచ్ఛ. తనకు నచ్చినట్లుగా తనని బ్రతకనివ్వడం. ఇక ప్రతీ ప్రేమికుడు ఒక సైనికుడితో సమానం. యుద్ధంలో సైనికుడు పోరాడితే, తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో చేసిన పోరాటమే ఈ సినిమా కథ. అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
()రాగల 24 గంటల్లో
ప్రముఖ నటి ఈషా రెబ్బ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం రాగల 24 గంటల్లో. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించగా సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించగా అక్టోబర్ 18న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.