నయా లుక్‌లో ప్రిన్స్‌ మహేష్‌

131
- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో  సినిమా చేస్తున్నాడు. అయితే సర్కార్‌ వారి పాటతో బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డ మహేష్‌…లేటెస్ట్‌గా సరికొత్త హేయిర్‌ స్టైల్‌తో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు.

త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో మహేష్‌ గతంలో ఎన్నడూ లేనివిధంగా నయా లుక్‌తో కనిపించనున్నారని టాలీవుడ్ టాక్‌. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే యేడాది ఎప్రిల్‌28న రిలీజ్‌కు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఇంతవరకు ఈ సినిమా టైటిల్‌ను కూడా ఖారారు చేయని చిత్రబృందం… దీపావళి సందర్భంగా టైటిల్‌ను ఖారారు చేయనున్నారని సమాచారం.

లేటెస్ట్‌గా మహేష్‌ లుక్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. సరికొత్త హేయిర్‌ స్టైల్‌తో అల్ట్రా స్టైలిష్‌గా ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రముఖ సెలబ్రెటీ హేయిర్‌ డ్రెస్సర్‌ అలీమ్‌ హకిమ్‌ ఈ సరికొత్త లుక్‌ను తీర్చిదిద్దారు.

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొన్ని క్షణాల్లో వైరల్‌గా మారి…మహేష్‌ నెక్స్ట్‌ మూవీపై అందరి ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇక మహేష్-తివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. హారికా& హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడట.

- Advertisement -