టాలీవుడ్ లో సమ్మెకు ఎండ్ కార్డ్..

6
- Advertisement -

టాలీవుడ్‌లో సమ్మెకు ఎండ్ కార్డు పడింది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో లేబర్ కమిషన్ చర్చలు సక్సెస్ అయ్యాయి. FDC చైర్మన్ దిల్ రాజు సమక్షంలో చర్చలు సఫలం అయ్యాయి.

నేటి నుంచి షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ను సినిమా హబ్ గా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు దిల్ రాజు. భారతీయ సినిమాలు అన్నీ ఇక్కడ షూటింగ్స్ చేసుకునేలా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. ఈ క్రమంలో ఇండస్ట్రీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి సీఎం రేవంత్ చేపడుతున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు.

Also Read:అనాస…ఉపయోగాలు తెలుసా?

- Advertisement -