జూన్‌ నుండి షూటింగ్స్‌కు అనుమతి..

82
kcr and chiru

ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను సినీ దర్శకులు,నటులు,నిర్మాతలు ప్రగతిభవన్‌లో కలిశారు. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించారు. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని సీఎంను సినీరంగ ప్రతినిధులు కోరారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై సానుకూలంగా సీఎం స్పందించారు.

kcr cm

జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లపై విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు, కొవిడ్‌ నివారణ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్‌ సినీ ప్రముఖులకు సూచించారు.

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన సినిమా షూటింగ్‌లు, రీప్రొడక్షన్లు దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని వారికి కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, కొరటాల శివ, దిల్ రాజు, ఎన్.శంకర్, సి.కల్యాణ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.