- Advertisement -
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో ఇప్పుడిప్పుడే అన్ని తెరచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో సినిమా నిర్మాతల మండలి సభ్యులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులతో పాటు దిల్ రాజు, సురేశ్ బాబు, తదితరులు హాజరయ్యారు.
సినిమాలు, షూటింగ్‌లతో పాటు సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడుతుండటంతో ఎంతశాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడపాలి, కరోనా థర్డ్ వేవ్ వస్తే ఏం చేయాలి అన్నదానిపై చర్చించనున్నారు. కరోనా ఉధృతి కారణంగా గత కొంత కాలం నుంచి సినిమా థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే.
- Advertisement -