జనసేనానితో టాలీవుడ్‌ నిర్మాతల కీలక భేటీ..

18
Pawan Kalyan

శుక్రవారం జ‌న‌సేన అధినేత, పవర్‌ స్టార్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ప‌లువురు టాలీవుడ్ నిర్మాత‌లు సమావేశమైయ్యారు. పవన్‌ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. ఆయన విమర్శల దాడి అనంతరం టాలీవుడ్ నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు యువ హీరోలు పవన్‌కు మద్దతు పలకగా, పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.

కాగా, తాజాగా టాలీవుడ్ నిర్మాత‌లు దిల్ రాజు, డీవీవీ దాన‌య్య, మైత్రీ మూవీ మేక‌ర్స్ న‌వీన్ యేర్నేని, యూవీ క్రియేష‌న్స్ వంశీ రెడ్డి, ఏసియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ ఇత‌ర నిర్మాత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆయ‌న నివాసంలో క‌లిశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను స్నేహపూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప‌రిష్క‌రించుకునే విష‌య‌మై నిర్మాత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చ‌ర్చించిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.