ప్రముఖ నిర్మాత దిల్ రాజు,హీరో శర్వానంద్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పెద్ద సినిమాలతో పోటీ పడుతు దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్ కాటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
‘శతమానం భవతి’ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశారని అన్ని వర్గాల నుంచి తమకు అభినందనలు వెలువెత్తుతున్నాయని దిల్‌రాజు అన్నారు. తాను ఇప్పటివరకు 22 సినిమాలు నిర్మించానని.. వాటన్నింటిలోనూ ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా ముందు శర్వానంద్‌ను అనుకోలేదని…అయితే కథే ఆయన వద్దకు నడుచుకుంటూ వచ్చిందన్నారు. ‘శతమానం భవతి’ చిత్రంలో నటించడం తన అదృష్టమని శర్వానంద్ పేర్కొన్నారు.
గతంలో దిల్ రాజు నిర్మించిన సినిమాలు విజయవంతం అయినప్పుడు కూడా శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ…ఇవాళ తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సిస్ లోను శతమానం భవతి సత్తా చాటుతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.