దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటివలే ఈసినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈనెల 19 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని దాదాపు, రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
బాహుబలి తర్వాత రాజమౌళి తెరెకెక్కిస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలున్నాయి. ఈమూవీ తారక్ చరణ్ లు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాలో ముగ్గరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరా అని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. మహానటి లో సావిత్రి పాత్రలో నటించి రాజమౌళి మెప్పు పొందిన కీర్తి సురేష్ ఖరారైపోయినట్టేనని తెలుస్తుంది. మరో హీరయిన్ గా రష్మీక మందన ను తీసుకున్నట్లు సమాచారం.
రష్మీక నటించిన ఛలో, గీత గోవిందం, దేవదాస్ మూవీలో నటించింది. దీంతో రాజమౌళి రష్మీకను కూడా ఎంపీక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఈసినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించగా సంగీతం ఎమ్. ఎమ్. కిరవాణి అందించనున్నారు.