టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్

52
- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ఓ సీనియర్ నటి పెళ్లి చేసుకోబోతుంది అంటూ టాక్ నడుస్తోంది. టాలీవుడ్ నటి ప్రగతి ఓ స్టార్ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆ నిర్మాత ప్రగతిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారట. చిన్న రిమార్క్ కూడా లేని ఆ ప్రొడ్యూసర్ అలా అడగడంతో ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా, ప్రగతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పైగా ఆమె వయసు 50కి దగ్గరలో ఉంది. మరి ఈ వయసులో పెళ్లి అంటే విశేషం.

అలాగే, తన భర్త చనిపోయాక నటి సురేఖా వాణి పెళ్లి చేసుకోబోతోదంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. ఓ బిల్డర్ తో సురేఖా వాణి గత కొన్ని నెలలుగా చాలా సన్నిహితంగా ఉంటుందని టాక్. అతనితో ఆమె పెళ్లికి రెడీ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. సురేఖా వాణి పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. నెటిజన్లు కూడా వందల రకాలుగా ఆమె పెళ్లి వార్తలను చెప్పుకున్నారు. ఏది ఏమైనా సురేఖా వాణి పెళ్లి చేసుకుంటే.. చెప్పే చేసుకుంటుంది కదా. త్వరలోనే ఆమె తన రెండో పెళ్లిని రివీల్ చేస్తోందట.

ఇక మెగా ఫ్యామిలీ‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ 1న ఇటలీలో తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ అవుతోంది. శుభలేఖలో బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం అంటూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ పేర్లని హైలైట్ చేశారు. కాగా, నవంబర్ 5న HYD‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పటికే ఆకర్షణీయంగా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి షాపింగ్ కూడా జరిగిందట.

- Advertisement -