వెండి తెరపై మహా శివులు!

3
- Advertisement -

మహా శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. ఇక టాలీవుడ్‌లో మహా శివరాత్రి ఎప్పటికి ప్రత్యేకమే. అలనాటి హీరోల నుండి నేటి తరం హీరోల వరకు శివుడి పాత్రలో ఎందరో నటులు మెప్పించారు. వెండితెరపై శివుడి పాత్రలో కనిపించిన హీరోలు, సినిమాల గురించి తెలుసుకుందాం.

సీనియర్ ఎన్​టీఆర్ ‘దక్షయజ్ఞం’ (1962) సినిమాలో శివుడిగా నటించారు. అక్కినేని నాగేశ్వరరావు ‘మూగ మనసులు’ (1964)లోని కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించారు. శ్రీ వినాయక విజయం లో కృష్ణం రాజు శివుడి పాత్రలో ఔరా అనిపించారు. ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో శివుడిగా నటించారు శోభన్ బాబు.

‘సీతారామ కళ్యాణం’లోని ఒక పాటలో కూడా శివుడిగా కనిపించారు బాలయ్య. మెగాస్టార్ చిరంజీవి ‘శ్రీ మంజునాథ’ లో శివుడిగా కనిపించారు. మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్ర చేశారు. చిరంజీవులు చిత్రంలో ఓ సరదా సన్నివేశంలో రవితేజ శివుడిగా కనిపించారు. జగపతి బాబు ‘పెళ్లైన కొత్తలో’ సినిమాలోని ఓ పాటలో శివుడి వేషధారణలో కనిపించారు.

అలాగే హీరో సుమన్, రామకృష్ణ, రంగనాథ్ ,బాలయ్య,నాగభూషణం ,రావుగోపాల రావు,రాజనాల,ప్రకాశ్​ రాజ్​ తదితరులు వెండి తెరపై శివుడి పాత్రలో నటించి మెప్పించారు.

Also Read:కీసరలో సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

- Advertisement -