Rains:ఏ హీరో ఎంత ఇచ్చాడో తెలుసా?

6
- Advertisement -

భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా ముఖ్యంగా విజయవాడ జలదిగ్బందంలోనే ఉంది. నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వరదల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకువచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు.

ఇప్పటివరకు విరాళాలు అందించిన వారి వివరాలను పరిశీలిస్తే..

()మెగాస్టార్ చిరంజీవి..కోటి రూపాయలు(తెలుగు రాష్ట్రాలకు)
()ప్రభాస్..రూ. 2 కోట్లు(తెలుగు రాష్ట్రాలకు)
()పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు
()జూనియర్ ఎన్టీఆర్..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలిపి కోటి రూపాయలు
()కల్కి నిర్మాతలు ,వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు,
()మహేష్ బాబు ..కోటి రూపాయలు(తెలుగు రాష్ట్రాలకు)
() బాలకృష్ణ..కోటి రూపాయలు(తెలుగు రాష్ట్రాలకు)
() ఆయ్ మూవీ యూనిట్ ..తొలి వారం వసూళ్లలో 25 శాతం
()త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 25 లక్షలు
() సిద్ధూ జొన్నలగడ్డ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 15 లక్షలు
()విశ్వక్ సేన్… ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 5 లక్షల9
()దర్శకుడు వెంకీ అట్లూరి.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షలు
()అనన్య నాగళ్ళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 2.5 లక్షల చొప్పున ప్రకటించారు.

Also Read:మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం

- Advertisement -