కాస్టింగ్‌కౌచ్ వివాదం టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ తగ్గే ప్రసక్తే లేదంటూ కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి రచ్చ చేస్తూనే ఉంది. శ్రీరెడ్డి పుణ్యమా అంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడిప్పుడే తమకు కూడా జరిగిన అన్యాయాలపై నోరువిప్పుతున్నారు.
అయితే ఇదంతా బాగానే ఉన్నా…ఇప్పుడు చిక్కంతా హీరోయిన్లకే అన్నట్టు తయారైంది. ‘కాస్టింగ్‌కౌచ్’ టాప్ హీరోయిన్లకు తలనొప్పిగా మారింది. ఇంటర్వ్యూలల్లో, బయట, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా.. కాస్టింగ్ కౌచ్‌పై మీ కామెంటేంటి..? అంటూ ప్రశ్నలు ఎదురౌతున్నాయి.
అయితే ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు ఈ వ్యవహారంపై స్పందించారు. ఇలియానా విషయానికొస్తే.. (ఇప్పుడు బాలీవుడ్‌లో ఉందనుకోండి అది వేరే విషయం) గతంలో ఓ జూనియర్ నటికి కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురైతే, సలహా కోసం తనను సంప్రదించినట్టు చెప్పుకొచ్చిన ఇల్లీ ఘాటుగానే రిప్లే ఇస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ ఏమంటోందంటే…‘నేను చాలా గట్టిదాన్ని. నచ్చకపోతే నో చెప్పగలను. నన్నెవరూ బలవంత పెట్టలేరు’ అంటూ తన గురించి పెద్ద డబ్బానే కొట్టేసుకుంది.
కాగా…రకూల్ శ్రీరెడ్డిల మధ్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద రచ్చే జరిగింది. తనకు ఎటువంటి కాస్టింగ్ కౌచ్ సమస్యలు రాలేదని, ఇక్కడ హీరోయిన్ల పరిస్థితి చాలా బాగుందని చెప్పుకొచ్చింది రకూల్ ప్రీత్‌సింగ్. దాంతో రకూల్ కామెంట్ పై శ్రీరెడ్డి తన విశ్వరూపం చూపించేసింది. రకూల్‌పై బూతులతో విరుచుకుపడింది కూడా. ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడేందుకు హీరోయిన్లు జడుసుకుంటున్నారనే చెప్పాలి. పొరపాటున మీడియాకి దొరికితే..ఎలా స్పందిచాలో అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.
మీడియా నుంచి తప్పించుకుంటే అయిపోతుందనే రోజులు కూడా కావివి. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చినా, రాకపోయినా నెటిజన్లు కాస్టింగ్‌కౌచ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఏంచేయాలో తెలీక ఈ మధ్య సోషల్‌మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు కొందరు హీరోయిన్లు.
ఫైనల్‌గా లైవ్‌లో శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడిగినా.. కొందరు భామలు సింపుల్‌గా నో కామెంట్స్ అనేస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ ఇప్పటికైనా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తమ మనసులో ఉన్నవిషయాల్నిఏ రకంగా వెల్లడిస్తారో.