హీరో నితిన్ ప్రేమ పెళ్లి…అమ్మాయి ఎవరో తెలుసా?

649
nithiin
- Advertisement -

టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో నితిన్ పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నితిన్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకొనున్నాడని తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విదేశాల్లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. అలాగే వీరి ప్రేమ వివాహినికి ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించారట.

అయితే నితిన్ ప్రేమించిన ఆ అమ్మాయి చిత్ర పరిశ్రమకు చెందినవారు కాదని తెలుస్తోంది. వీరి పెళ్లి పెద్దల సమక్షంలో వచ్చే ఏడాది సమ్మర్‌లో జరుగనున్నదని సన్నిహితుల సమాచారం. గతంలో కూడా నితిన్ పెళ్లిపై పలు వార్తలు వచ్చినా ఆయన స్పందించలేదు. ఈసారి అయిన నితిన్ పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి. కాగా ఈ ఏడాది నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ గ్యాప్‌లో కథలు విన్న నితిన్ ఒకేసారి నాలుగు చిత్రాలు ప్రకటించాడు.

ప్రస్తుతం ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఈ మూవీలో నితిన్ సరసన రష్మీక హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు నితిన్ మరో మూడు సినిమాలను సైన్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేయనున్నాడు. నితిన్ మూడవ సినిమా చంద్రశేఖర్ ఏలేటితో చేయనున్నాడు. అలాగే నాల్గవ సినిమా ఛల్ మోహన కృష్ణ మూవీ దర్శకుడు కృష్ణ చైతన్యతో చేయునున్నాడు.

- Advertisement -