తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందో తండ్రి పాత్రకు అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని సినిమా కథలైతే తండ్రి పాత్ర చూట్టే తిరిగిన సందర్భాలున్నాయి. అలాంటి తండ్రి పాత్రలకే వన్నె తెచ్చిన నటులు ఎందరో…ఫాదర్స్ డే సందర్భంగా వారిని గుర్తుచేస్తూ….
విలన్‌గా,బ్రదర్‌గా,డాన్‌గా,ఫ్రెండ్‌గా,పోలీస్ ఆఫీసర్‌గా,తాతగా,తండ్రిగా ఇలా ఏ పాత్ర అయిన అవలీలగా తనకోసమే పుట్టింది అన్నట్లుగా అలవోకగా చేసే నటుడు ప్రకాశ్ రాజ్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్…తండ్రి పాత్రలకే వన్నె తెచ్చారు. నువ్వు నేను,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,బొమ్మరిల్లు,ఆకాశమంత,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,వర్షం,రేసుగుర్రం,పరుగు ఇలా సినిమా సినిమాకు తండ్రి పాత్రల్లోని వైవిధ్యాన్నిచూపించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.
ఒక ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోలుగా మెప్పించి ప్రస్తుతం ప్రతినాయకుడిగా మెప్పిస్తున్న జగపతిబాబు, అర్జున్ కూడా తండ్రి పాత్రలకు ప్రాణం పోశారు.సరైనోడు వంటి చిత్రాల్లో అర్జున్ మెప్పించగా శ్రీమంతుడు,నాన్నకు ప్రేమతో,అరవింద సమేత వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు జగ్గూభాయ్.
ఇక తండ్రి పాత్రలకు మరో కేరాఫ్ అడ్రస్ మురళీ శర్మ. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాత ప్రస్తుతం సాఫ్ట్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు ప్రకాష్ స్థానాన్ని మురళీ శర్మ తన నటనతో భర్తీ చేశారు.
హీరో హీరోయిన్ లకు తండ్రి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులందరినీ మెప్పిస్తున్నాడు మురళి శర్మ. రీసెంట్‌గా అల వైకుంఠపురంలో మూవీలో కొడుకుపై శాడిజం చూపించే తండ్రిగా జీవించాడు మురళీ శర్మ. మొత్తంగా టాలీవుడ్‌లో ఎందరో నటులు తండ్రి పాత్రలకు ప్రాణం పోసి వన్నె తెచ్చారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ప్రేమను మరోసారి గుర్తుచేస్తూ స్పెషల్ విషెస్ తెలియజేస్తోంది greattelangaana.com
Also Read:Vishnu:ప్రతి సోమవారం కన్నప్ప అప్‌డేట్