టాలీవుడ్ కు విలన్లు కావలెను..!

428
mahesh babu
- Advertisement -

టాలీవుడ్‌లో విలన్ల కొరత ఏర్పడింది. తాజాగా సెట్స్‌పై ఉన్న అగ్రహీరోలంతా కొత్త విలన్ల కోసం ట్రై చేస్తున్నారు. సినిమా షూటింగ్ సగం పూర్తయిన ఇంకా విలన్లను ఫైనలైజ్ చేయలేదంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తికాగా ఇప్పటి వరకూ విలన్ ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు.

ప్రభాస్ మూవీ జాన్ సినిమాకు కూడా ఇంకా విలన్ ఎవరో క్లారిటీ లేదు. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ గా తెరెకెక్కుతున్న సినిమాలో కూడా ఇప్పటివరకూ విలన్ దొరకలేదు.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో కొత్త విలన్‌ కోసం వెతుకుతున్నారు పూరీ.

మహేశ్‌ బాబు సర్కార్ వారి పాటది ఇదే పరిస్ధితి. బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా కోసం కొత్త విలన్‌ని వెతికే పనిలో ఉన్నారు సుకుమార్. మొత్తంగా టాలీవుడ్‌లో కొత్త విలన్‌ను వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.

- Advertisement -