- Advertisement -
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో నవదీప్‌ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. సీపీ సీవీ ఆనంద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌తో పాటు పలువురు సినీ ప్రముఖలు ఉన్నారని వెల్లడించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నవదీప్. దీంతో ఆయనకు రిలీఫ్ లభించింది.
హైకోర్టు తీర్పుపై నవదీప్ ట్విట్టర్ లో స్పందించారు. పోలీసులు చెబుతున్న నవదీప్ తాను కాదని…. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఐదురురిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోడంతో నిందితుల ఫోన్లు కూడా సీజ్ చేశారు.
Also Read:మిస్టర్ ఇడియట్.. ఫస్ట్ లుక్
- Advertisement -