టాలీవుడ్ యువ దర్శకులుంతా ఒకే చోట కలిశారు. ఇటీవల నాని నటించిన హిట్ 3 బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా దర్శకులు అంతా ఒకేచోట కలిశారు.
ఈ గ్రూప్ ఫొటోలో.. శైలేష్ కొలను, సాయి రాజేష్, రాహుల్ సాంకృత్యాన్, వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర, బుచ్చిబాబు సాన, శివ నిర్వాణ, అనుదీప్, సాధినేని పవన్, భరత్ కమ్మ, శ్రీరామ్ ఆదిత్య, చందూ మొండేటి, సందీప్ రాజ్, హషిత్ గోలి, వెంకీ కుడుముల, వశిష్ఠ, స్వరూప్, ఫణి ప్రదీప్, వినోద్.. ఇంతమంది దర్శకులు ఉన్నారు. వీళ్లంతా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వారే.
వీరంతా వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోడానికి, అందరూ ఒక ఫ్యామిలీలా ఉండటానికి అన్నట్టు డైరెక్టర్ సాయి రాజేష్ తెలిపారు.
View this post on Instagram
Also Read:విశ్వక్ మూవీలో పుష్ప 2 నటుడు!

