వెంకీమామతో దసరా బరిలో సైరా…!

449
chiranjeevi

సినిమా క్యాలెండర్‌లో సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున మార్కెట్‌ జరిగే పండుగ దసరా. అందుకే పండుగల సందర్భంగా విడుదలయ్యే సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సారి దసరా కూడా అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.

సినీ అగ్రహీరోలు చిరంజీవితో వెంకీ తలపడనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుని దసరాకు సైరా అంటూ వచ్చేందుకు సిద్ధమవుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇక నాగచైతన్య-వెంకటేష్ మల్టీస్టారర్‌ వెంకీ మామ చిత్ర విడుదల తేదీ ప్రకటించినప్పటికీ దసరాకి దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో దసరా రేసులో గెలిచేది ఎవరా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.