- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు సినీ ప్రముఖులు. బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏపీ సీఎంతో భేటీ కానున్నారు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు. మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు.
భేటీ అయ్యేవారిలో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని తదితరులు ఉన్నారు.
గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్లగా ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు కలవనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలరే ఈ భేటీ జరగనుంది. ఈ మీటింగ్ లో ఏం చర్చిస్తారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read:రాజాసాబ్..టీజర్ లీక్!
- Advertisement -

