తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం హరిత హారం. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పలు సందర్భాల్లో తెలిపారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు అభినందనలు తెలిపారు. ఇప్పటికే హరిత హారం కార్యక్రమం మూడు విడతలుగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే నాల్గవ విడత హరిత హారం కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోన్నారు అధికారులు.
ఈసందర్భంగా సీని నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ కూడా హరిత హారం కార్యక్రమంలో పాల్గోననున్నట్లు తెలిపారు. జులై 1వ తేదిన తమ కూతురు శివాని పుట్టిన రోజు సందర్భంగా తాము హరిత హారం కార్యక్రమంలో పాల్గోనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా జీవిత నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక్ వర్గీస్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారిద్దరూ హరితహారం కార్యక్రమం గురించి చర్చించారు. తమ ట్రస్ట్ తో పాటు కుటుంబ సభ్యులం అందరం ఈ కార్యక్రమంలో పాల్గోంటామన్నారు.