బగ్గుమంటున్న బంగారం ధర..

402
gold
- Advertisement -

బంగారం ధర రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పసడి ధర ధగధగలాడుతోంది. భారీగా ర్యాలీ చేస్తూ కొండెక్కి కూర్కొంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడుస్తోంది.

హైదరాబాద్ మార్కెట్లో 99.9 (24 కేరెట్) స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.44,430 పలికింది. 99.5 (22 కేరెట్) స్వచ్ఛతతో కూడిన బంగారం ధర రూ. రూ.40,730గా నమోదైంది. 24 కేరెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో గత వారం రోజుల్లోనే రూ. 1790 పెరగడం గమనార్హం. ఈ నెల 17న మార్కెట్లో రూ.42,640 ధర పలకగా నిన్న రూ.44,430కి చేరింది. ఇక 22 కేరెట్ బంగారం ధర రూ.1580 పెరిగింది.

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. వెండి ధర రూ.1100 పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.49,900 నుంచి రూ.51,000కు ఎగసింది. కోవిడ్-19 కారణంగా మదుపర్లు బంగారం వైపు మళ్లడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ వంటివి ధర పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -