- Advertisement -
బంగారం కొందామని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ క్షీణించింది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్తనే. పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. ఎలాంటి మార్పు లేదు.
వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.40,230, విజయవాడలో రూ.40,300, ప్రొద్దుటూరులో రూ.40,250, చెన్నైలో రూ.40,150గా ఉంది.
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,320, విజయవాడలో రూ.37,300, ప్రొద్దుటూరులో రూ.37,280, చెన్నైలో రూ.38,240గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,800, విజయవాడలో రూ.48,300, ప్రొద్దుటూరులో రూ.48,000, చెన్నైలో రూ.50,700 వద్ద ముగిసింది.
- Advertisement -