తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

56
Tirumala Darshan
- Advertisement -

తిరుపతి కొండపై శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు.. భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్టుమెంట్లు నిండి కిలోమీటర్‌ మేర భక్తులు వేచి ఉన్నారు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 68,873 భక్తులు దర్శించుకోగా 38,952 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.44 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -