- Advertisement -
భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో రోడ్లకు గండి పడి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొగా ఇవాళ కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని…. వచ్చే 12 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
- Advertisement -