తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 35,12,333 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు అధికారులు. మొత్తం 52,19,180 వ్యాక్సినేషన్ డోస్ లు సిద్దం చేసింది ప్రభుత్వం. మరోవైపు 5సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికి ఈ పోలియో చుక్కలు వేపించాలని పిలుపునిచ్చారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.
పోలియో చుక్కలు వేయిద్దాం..పోలియోరహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈకార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు ఎంపీ. ఈరోజు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ స్వయంగా కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.