నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ 5గురి గెలుపు లాంఛనమే

304
Legislativecouncil
- Advertisement -

 తెలంగాణలో ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరూ పాల్గోననున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకూ అసెంబ్లీలో ఈఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం కౌటింగ్ ప్రక్రియ జరుగనుంది. మొత్తం ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు టీఆర్ఎస్ నలుగురు అభ్యర్దులను బరిలో ఉంచగా, ఎంఐఎం ఒక అభ్యర్ధిని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కు తగినంత ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరించింది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు నిన్న సాయంత్రం తెలంగాణ భవన్ లో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యి మాక్ పోలింగ్ లో పాల్గోన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఇవాళ ఉదయం స్పెషల్ బస్సులలో అసెంబ్లీకి రానున్నారు. అనంతరం మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాక ఓటింగ్ లో పాల్గోంటారు. ఇక కాంగ్రెస్ ఈఎన్నికను బహిష్కరించడంతో టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్ధుల గెలుపు లాంఛనం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఈఓటింగ్ లో పాల్గోనవద్దని విప్ జారీ చేశారు టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క. ఇక ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు సీఎం కేసీఆర్. నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ లో ఓటింగ్ పై పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా మహమూద్ అలీకి హైదరాబాద్, మహబూబ్‌నగర్, శేరి సుభాష్‌రెడ్డికి మెదక్, నిజామాబాద్, సత్యవతిరాథోడ్‌కు వరంగల్, నల్లగొండ, ఎగ్గె మల్లేశంకు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలను కేటాయించారు.

- Advertisement -