నేడు మహాశివరాత్రి పుసర్కరించుకుని రాష్ట్రంలోని పలు ఆలయాలకు పోటెత్తారు భక్తులు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఇక రాష్ట్రంలో ప్రసిద్ద ఆలయాలయినటువంటి వేములవాడ రాజన్న ఆలయం, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలంపూర్ ఆలయాల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
భక్తుల రద్దీ దృష్టా అన్ని ప్రధాన ఆలయాల్లో సెక్యూరిటీని ఎర్పాటు చేశారు అధికారులు. అటు కీసర, చిలుకూరు బాలాజి టెంపుల్ లలో కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఆలయానికి వచ్చే వారి కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.