చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 6

258
Today in History
- Advertisement -

{[“ఫిబ్రవరి 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 37వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 328 రోజులు (లీపు సంవత్సరములో 329 రోజులు) మిగిలినవి.”]}

*సంఘటనలు*

1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.

1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.

2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.

*జననాలు*

1890: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1988)

1892: విలియం పి. మర్ఫీ, రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త.

1923: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)

1932: భమిడిపాటి రామగోపాలం, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)

1947: కె.వి.కృష్ణకుమారి, ప్రముఖ రచయిత్రి.

1956: కావలి ప్రతిభా భారతి, రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.

*మరణాలు*

1804: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ను కనుగొన్నవాడు. (జ.1773)

1827: శ్యామశాస్త్రి, ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (జ.1762)

1889: సూరి భగవంతం, ప్రముఖ శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909)

1925: దామెర్ల రామారావు, ప్రముఖ చిత్రకారుడు

1931: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861)

1965: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

1976: దీవి రంగాచార్యులు, సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)

1993: ఆర్థర్ ఆష్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.

2008: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950)

2015: ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు ఆత్మారాం భెండే

- Advertisement -