జనవరి 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 11వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 354 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 355 రోజులు
*సంఘటనలు*
1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1 నవంబర్ 1956 నుంఛి 11 జనవరి 1960 వరకు).
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (11 జనవరి 1960 నుంఛి 29 మార్చి 1962 వరకు).
*జననాలు*
1968: శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు
1973: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.
*మరణాలు*
1966: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)
1983: భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894)
2008: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
2012: వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు
2016: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
2016: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (జ.1927)