చరిత్రలో ఈ రోజు : నవంబర్ 19

230
Today in History
- Advertisement -

(నవంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి.)

*సంఘటనలు*

1951: మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును.
1977: ఆంధ్ర ప్రదేశ్‌ లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.

*జననాలు*

1828: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858)
1852: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (మ.1909)
1917: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)
1928: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012)
1954: చింతా మోహన్, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
1960: శుభలేఖ సుధాకర్, ప్రముఖ నటుడు.
1965: కిల్లి కృపారాణి, రాజకీయ నాయకురాలు మరియు వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం.
1973: షకీలా, ప్రముఖ భారతీయ నటి.
1975: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి.

*మరణాలు*

1806: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728)
1995: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908)
1995: మద్దిపట్ల సూరి, ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు సాహితీవేత్త. (జ.1920)
2007: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం.

- Advertisement -