డీజీల్ ధరలు పైపైకే..!

172
petrol price
- Advertisement -

రోజురోజుకి పెరుగుతున్న చమురు ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. పెట్రోల్ ధరలు స్ధిరంగానే ఉన్న డిజిల్ ధరలు పెరుగుతుండటం అందరికి షాక్ ఇస్తోంది. హైదరాబాద్‌‌లో ఆదివారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49గా ఉండగా డీజిల్ ధర మాత్రం 14 పైసలు పెరుగుదలతో రూ.80.14కు చేరింది.

అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.85.21గా ఉండగా డీజిల్‌ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.81.31కు చేరింది. దేశ రాజధాని పెట్రోల్ ధర రూ.80.43గా ఉండగా డీజిల్ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.81.94కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ 0.07 శాతం పెరుగుదలతో 43.34 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.66 శాతం పెరుగుదలతో 41.34 డాలర్లకు ఎగసింది.

- Advertisement -