కీళ్ల నొప్పులను సహజంగా తగ్గించండిలా!

45
- Advertisement -

కీళ్ల నొప్పుల కారణంగా చాలమంది వారి సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన వారిలో ఈ కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు నడవలేకపోవడం, నిలబడలేక పోవడం, తేలికపాటి బరువులు కూడా ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరిలో ఈ కీళ్ల నొప్పుల సమస్య దీర్ఘ కాలికంగా కూడా వేధిస్తూ ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి బయట పడేందుకు రకరలాల మెడిసన్స్ వాడుతూ ఉంటారు. అయితే కీళ్ల నొప్పులకు సహజసిద్దంగా కూడా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం

సహజంగా ఉదయంపూట కీళ్ల నొప్పుల సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే చిన్నపాటి వ్యయమాన్ని అలవాటు చేసుకోవాలి.సిట్అప్స్, ఆఫ్కొడ్స్, వంటివి చేయడం వల్ల కళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.. ఇంకా సాధ్యమైనంత వరకు ఉదయం నిద్ర లేవగానే ఒక అరగంట నడకకు కేటాయించాలి. ఇంకా ఈతకొట్టడం, సైక్లింగ్ వంటివి కూడా చేస్తే మంచిదట. తద్వారా కీళ్లనొప్పులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నీరు ఎక్కువగా త్రాగలి. .

ఎందుకంటే నీరు కీళ్ల యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచి మృదులాస్థి కదలికలను సులభతరం చేస్తుంది. అంతే కాకుండా డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా త్రాగలట. ఇక కీళ్ల నొప్పులను దూరం చేయడంలో మనం తినే ఆహారం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కీళ్ల నొప్పి అధికంగా ఉన్న చోట చల్లటి లేదా వేడి ప్యాక్ లను పూయడం లేదా యూకలిఫ్టస్ ఆయిల్ పూసి వేడి నీటితో తాపడం పెట్టడం వంటివి చేస్తే కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు. కాగా కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -