మన భావోద్వేగాలు ఎల్లప్పుడూ నేరుగా బయటపడవు….కొన్నిసార్లు అవి విపరీతమైన ఆకలి (cravings) లేదా యాంగ్జైటీ (ఆందోళన) రూపంలో వ్యక్తమవుతాయి. మానసిక సమస్యలకు కేవలం పోషకాహారం మాత్రమే ప్రత్యామ్నాయం కానప్పటికీ మనం తినే ఆహారం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
యాంగ్జైటీ, ఏకాగ్రత లోపించడం,నీరసంతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో వైద్య నిపుణులు వివరించారు. తక్కువ మూడ్, యాంగ్జైటీ, ఏకాగ్రత లేకపోవడం అనేవి ఎల్లప్పుడూ కేవలం మానసిక సమస్యలు మాత్రమే కావు. కొన్నిసార్లు మీ మెదడు, నరాల వ్యవస్థకు సరైన ఇంధనం (పోషకాలు) అందకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. సరైన పోషకాలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని, సెరోటోనిన్ హార్మోన్ విడుదలను పెంచి, భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడతాయి అని నిపుణులు చెబుతున్నారు.
మానసిక సమస్యలను దూరం చేసే ఆహారాలు..
1. యాంగ్జైటీ (ఆందోళన) తగ్గడానికి:
శరీరంలో మెగ్నీషియం లోపానికి, యాంగ్జైటీకి చాలా బలమైన సంబంధం ఉంది. మెగ్నీషియం మన నరాల వ్యవస్థకు “బ్రేక్ పెడల్” లాగా పనిచేస్తుంది; ఇది మెదడులోని అతి చురుకుదనాన్ని తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds), చియా గింజలు (Chia seeds), బాదం పప్పులు. ఇవి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించి, మనసుకు సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి.
2. మూడ్ అప్‌సెట్ (బాధగా/నీరసంగా అనిపించడం):
మానసిక స్థితిని (mood) మార్చడంలో, శరీరానికి శక్తిని ఇవ్వడంలో విటమిన్-డి అత్యంత కీలకమైనది. దీనిని “సన్‌షైన్ విటమిన్” అని కూడా పిలుస్తారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల మూడ్ సరిగ్గా లేనప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. పొద్దున్నే సూర్యరశ్మి తగలడం, మష్రూమ్స్ (పుట్టగొడుగులు), కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు .
Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!
3. ఏకాగ్రత లోపించడం:
మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతకు కారణమయ్యే ఒక ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి ‘కోలిన్’ అనే పోషకం చాలా అవసరం. శరీరంలో ఇది లోపిస్తే బ్రెయిన్ ఫాగ్ (మతిమరుపు), నీరసం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కోడిగుడ్డు సొన , లివర్ (కాలేయం), చిక్కుళ్లు/పప్పుధాన్యాలు . ఇవి రోజువారీ కోలిన్ అవసరాలను తీర్చి మెదడు ఆరోగ్యానికి మద్దతునిస్తాయి.

