కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!

59
- Advertisement -

నేటి రోజుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో కిడ్నీ సమస్యలు పెరగడానికి కారణం ఆహారపు అలవాట్లు, జీవన విధానమే కారణమని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలో గుర్తించడం కష్టమే. సమస్య పెరిగేకొద్ది కిడ్నీ వ్యాధుల లక్షణాలు బయటపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో మూత్ర పిండాల సమస్యలు ఉంటే కొన్ని లక్షణాలను లక్షణాలను గురించవచ్చు. మొఖంపై వాపు, ఆయాసం, మూత్రం సరిగా రాకపోవడం, వంటి సాధారణ సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. .

ఇక కిడ్నీల్లో రాళ్లు ఉంటే నడుం నొప్పి, మూత్ర విసర్జనలో మంట మరియు నొప్పి, చలి జ్వరం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు ఏ మాత్రం కనిపించిన.. వెంటనే సరైన వైద్యుడిని సంప్రదించాలి. అయితే కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవడానికి కొన్ని సూచనలు, చిట్కాలు చాలా బాగా ఉపయోగ పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక స్పూన్ దానియాలు మరియు జీలకర్ర రెండిటినీ పొడిగా చేసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఆ తరువాత చల్లార్చిన ఆ రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి ఇలా చేయడం వల్ల కిడ్నీలలోని వ్యర్థాలు తొలగిపోయి శుభ్రపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తద్వారా కిడ్నీ సంబందిత సమస్యలు దరిచేరవట. ఇంకా దానియాలు, జీలకర్ర కలిసిన ఈ మిశ్రమానికి కాస్త నిమ్మరసం యాడ్ చేసే మరింత మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే మనం తినే ఆహారంలో ఉప్పు తగ్గించడం, రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉండేలా చూసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం వంటి కనీసపు సూచనలు పాటించడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులను కొంతమేర దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్న మాట.

Also Read:ముఖ స్వనాసనంతో ఒత్తిడి దూరం!

- Advertisement -