ప్రియమైన వారి ‘లైఫ్ లొకేషన్’ తెలుసుకోండిలా!

22
- Advertisement -

కుటుంబ సభ్యులకు గాని లేదా ఫ్రెండ్స్ కు గాని లేదా ఇంకెవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు పోన్ ఎత్తకపోతే తెగ టెన్షన్ పడుతుంటాము. వారు ఎక్కడున్నారు ? ఎందుకు ఫోన్ ఎత్తడం లేదని తెగ ఆందోళనకు గురవుతుంటాము. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ మహిళల విషయంలోనూ ఈ రకమైన టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే వారున్నచోటునూ తెలుసుకోవడం గతంలో చాలా కష్టతరంగా ఉండేది. కానీ నేటి రోజుల్లో టెక్నాలజీ పెరగడంతో ఎవరు ఎక్కడున్నా సులువుగా తెలుసుకునే వీలు కలిగింది. తాజాగా గూగుల్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ కాంటాక్ట్ యాప్ ద్వారా ప్రియమైన వారి లొకేషన్ తెలుసుకునే వీలు కల్పించింది అదెలాగో చూద్దాం.

ఎవరిదైనా లైవ్ లొకేషన్ తెలుసుకోవాలంటే ముందుగా ప్లేస్టోర్ నుంచి గూగుల్ కాంటాక్ట్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత లొకేషన్ తెలుసుకోవాలనుకునే వారి యొక్క మొబైల్ నెంబర్ ను కాంటాక్ట్ లో సేవ్ అయి ఉండాలి. ఆ తర్వాత సెర్చ్ బార్ లో వారి పేరును టైప్ చేయాలి. అప్పుడు లొకేషన్ తెలుసుకోవాలనుకునే వారి పేరు లేదా ఫోన్ నెంబర్ పై క్లిక్ చేయగానే కాల్, మెసేజ్, లొకేషన్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో లొకేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. తద్వారా వారున్నా లొకేషన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. అప్పుడు అవతలి వాళ్ళు ఎక్కడున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత మన లొకేషన్ వారికి షేర్ చేయడం గాని లేదా మనమే వారున్నా చోటికి వెళ్లడంగాని చేయవచ్చు.

Also Read:Amith Shah:వారిద్దరికి అమిత్ షా వార్నింగ్?

- Advertisement -