- Advertisement -
టీఎంయూ నేత అశ్వద్ధామరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీఎంయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్ రెడ్డి. బీజేపీలో ఎమ్మెల్సీ సీటు వచ్చే వరకు యూనియన్ లో ఉంటాడని…అతని వల్ల ఏం లాభం లేదని మండిపడ్డారు.
స్వలాభం కోసం తప్ప ఆయనతో కార్మికులకు ఎటువంటి ఉపయోగంలేదని…టీఎంయూ వ్యవస్థాపకుడిని తానేనని అన్నారు. బీజేపీకి వెళ్లాలనుకుంటే వెళ్లాలని… ట్రేడ్ యూనియన్ లో రాజకీయ పోకడలు తగవని హెచ్చరించారు. ఇప్పటికైనా అశ్వద్ధామరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు సమస్యలు వస్తే పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఆర్టీసీ సంస్థ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. సంస్థలో 33 మంది కరోనాతో మృతిచెందారని ప్రధానకార్యదర్శి అశ్వద్ధామరెడ్డి ముఖం చాటేశారని ఫైర్ అయ్యారు.
- Advertisement -