హైదరాబాద్ బేగంపేట టీఎంసీ షోరూంలో దసరా దీపావళి మెగా లక్కీ డ్రా ఫెస్టివల్ గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ హాజరయ్యారు. బంపర్ డ్రా తీసి విజేతలకు అభినందనలు తెలిపారు. బేగంపేటకు చెందిన వి. నాగరాజు కూపన్ నెంబర్ (111606) లక్కీ డ్రాలో కిలో బంగారాన్ని గెలుచుకున్నారు. లక్కీ డ్రా విజేత నాగరాజుతో ఫోన్లో మాట్లాడిన టీ న్యూస్ ఎండీ సంతోష్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ,ఏపీ రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మరియు హోమ్ సప్లయెన్స్గా టీఎంసీ మంచి గుర్తింపు పొందిందని సంస్థ ఛైర్మన్ ఉమా అమర్ నాద్ తెలిపారు. ఎక్కువ టర్నోవర్ … తక్కువ లాభం అనే సూత్రంతో సంస్థ ముందుకెళుతుందని ఆమె వెల్లడించారు. కస్టమర్ల హృదయాలలో టీఎంసీ చెరగని స్ధానం పొందిందని .. వారి కుటుంబాల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యమని వెల్లడించింది.
https://youtu.be/FYWj1fGjYOU