‘ARM’..అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా

10
- Advertisement -

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. “ARM” సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఇది మీ50మైల్ స్టోన్ మూవీ.. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?
-స్మాల్ యాక్టర్ కెరీర్ ప్రారంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ చేశాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నాను. యాక్టర్ కావాలనేది నా డ్రీం. ఇప్పుడా డ్రీంలో జీవిస్తున్నాను.

-ARM మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ సినిమా అవుతుందని తెలీదు. ARM చాలా ఎక్సయిటింగ్ స్క్రిప్ట్. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం హ్యుజ్ ఛాలెంజ్. డైరెక్టర్ నాపై నమ్మకం ఉంచారు. ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేశాం. ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా వుంటాయి.

-ఇందులో మూడు పాత్రలు ఇష్టమే. అయితే దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టం(నవ్వుతూ) చాలా పాషనేటింగ్ క్యారెక్టర్ అది. తను చాలా కాన్ఫిడెన్స్ గల దొంగ. ఆడియన్స్ అ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.

మీరు ఆరు నెలల్లో కళరి ఫైట్ నేర్చుకున్నారా?
-ఆరు నెలల్లో కళరి నేర్చుకోవడం అనేది పెద్ద మాట. ఆరు నెలలు కళరి ఫైట్ ప్రాక్టీస్ చేశాను. కొన్ని బేసిక్స్ పై అవగాహన వచ్చింది.

ఇంత పెద్ద స్కేల్ వున్న సినిమాకి డెబ్యుటెంట్ డైరెక్టర్ పై నమ్మకం వుంచడం గురించి ?
-జితిన్ లాల్ తో నాకు ఎనిమిదేళ్ళుగా జర్నీ వుంది. తను చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా వుంది. నా కెరీర్ లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. పరస్పర నమ్మకంతోనే ఇది సాధ్యపడుతుంది.

ARM లో ఎదురుకున్న ఛాలెజింగ్ ఏమిటి ?
-సినిమా చూసినప్పుడు మీకు అర్ధమౌతుంది. ఇందులో చాలా ఫైట్స్ సీక్వెన్స్ లు వున్నాయి. క్యారెక్టర్ స్విచస్ వుంటాయి. మేకప్ కే చాలా సమయం పట్టేసేది. చాలా లోకేషన్స్ లో షూట్ చేశాం. నా క్యారెక్టర్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. నోట్స్ రాసుకున్నాను. అవన్నీ హెల్ప్ అయ్యాయి.

-ఇందులో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వుంటుంది. టైం పీరియడ్స్ ని ఆడియన్స్ సులువుగా అర్ధం చేసుకుంటారు. డైరెక్టర్ ప్రతి డిటెయిల్ ని చాలా చక్కగా తెరకెక్కించారు.

కృతి శెట్టి క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
ట్రైలర్ లో మూడు డిఫరెంట్ లవ్ స్టొరీస్ కనిపించాయి. ఈ ప్రేమకథల్లో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ ,సురభి లక్ష్మి అద్భుతంగా నటించారు.

Also Read:ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

త్రీడీలో రిలీజ్ చేయడం గురించి?
-ఈ సినిమాకి ఇమాజినరీ ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేశాం. అందరినీ కథలో లీనం చేయడం కోసం త్రీడీ చాల హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ స్పానిస్ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. దాదాపు ముఫ్ఫై భాషల్లో సబ్ టైటిల్స్ వేస్తున్నాం. యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే సినిమా.

ARM టైటిల్ గురించి ?
-ARM.. ‘అజాయంతే రందం మోషణం’. అజయన్ రెండో దొంగతనం అని దీని అర్ధం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం కాస్త ఇబ్బందిగా వుంటుంది. అందకే అందరూ పలికే విధంగా ARM ని వ్యవహరిస్తున్నాం.

ARM మ్యూజిక్ గురించి ?
ధిబు నినాన్ తమిళ్ లో పాపులర్ మ్యూజిక్ చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ చేయడంతో పాటు బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు.

ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడం గురించి?
-నడిగర్’ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ తో అసోషియేట్ అయ్యాను. వారుతో నాకు జర్నీ వుంది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యుటర్స్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా వుంది.

ఎలాంటి కథలు ఎంచుకుకోవడానికి ఇష్టపడతారు?
-ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుండే కథ, పాత్ర చేయాలనే నా ప్రయత్నం. ఎక్స్ ప్లోర్ చేయాల్సింది చాలా వుంది. ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూ ముందుకువెళుతున్నాను.

మిన్నల్ మురళికి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ వున్నారు.. మీ కాంబినేషన్ లో సీక్వెల్ రావచ్చా ?
-మిన్నల్ మురళి డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా వున్నారు. సీక్వెల్ చేస్తే గనుక మిన్నల్ మురళి కంటే బెటర్ గా వుండే కథ కుదిరినప్పుడే చేయాలి.

తెలుగు సినిమాలు చూస్తారా? తెలుగు కథలు వింటున్నారు?
-తెలుగు సినిమాలు చూస్తాను. నేను చూసిన మొదటి సినిమా చిరంజీవి గారి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.
-తెలుగు స్క్రిప్ట్ డిస్కర్షన్స్ జరుగుతుంటాయి. లెట్స్ సీ.(నవ్వుతూ)

- Advertisement -