విరుచుకుపడ్డ తిత్లీ తుఫాన్‌….

357
Titli Cyclone Hits AP
- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. తిత్లీ  తుఫాన్‌ ధాటికి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటికే మూడు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్నిచోట్ల  విరిగి పడిన చెట్లు విరిగిప‌డ్డాయి. పెనుగాలుల ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉద్దానంతో పాటు పలాస, టెక్కలి ప్రాంతాల్లో తుఫాన్‌ బీభత్సం  చూస్తుంటే  వ‌ణుకు పుడుతోంది. ఈ తుఫాన్‌ తీరాన్ని దాటినప్పటికీ వజ్రపు కొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో ఈదురు గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. గంటకు 120 కొలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
సైక్లోన్‌ ఐ గా పిలిచే ఈ తుఫాన్‌  52 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. తిత్లీ తుఫాన్‌ విద్వంసం ఈరోజు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.  ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు ఈ తుఫాన్ దిశ  మార్చుకుంటోందని వాతావరణశాఖ తెలియజేసింది.

- Advertisement -