1912లో అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన జలాంతర్గామి గల్లంతయ్యింది. అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈటూర్‌లను నిర్వహిస్తోంది. ఈయాత్ర కోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ప్రమాద సమయంలో జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటుగా ఒక గైడ్, పైలట్ ఉన్నట్టు సమాచారం.
జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో అమెరికా కెనడాకు చెందిన రక్షణ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన జలాంతర్గామిలో 70 నుంచి 96గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే ఉందని సదరు అధికారులు తెలిపారు. టైటానిక్ శకలాలు చూపించేలా ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాత్ర టికెట్ ధర 2.50లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ.2కోట్లకు పైగా ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా 400మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ మినీ జలాంతర్గామిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయని ఓషన్ గేట్ సంస్థ చెబుతోంది.
Also Read: ఉదయం లేవగానే ఇలా చేస్తే మంచిది..!
ఇందులో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తుల గురించి పూర్తి సమాచారం వెలువరించలేదు. కానీ అంతకు ముందు జలాంతర్గామి డైవ్ చేస్తున్న సమయంలోయాక్షన్ ఏవియేషన్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా తెలుస్తోంది. జలాంతర్గామి ఇప్పుడే బయలుదేరింది. హమీష్ విజయవంతంగా డైవింగ్ చేస్తున్నారు. ఈయన బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ హమీష్ హార్డింగ్ ఉన్నట్టు తెలిపారు. హమీష్ గతంలో ది చాలెంజర్ డీప్‌ను సందర్శించారు. ఇది ఫసిఫిక్ మహాసముద్రంలో ఉన్న లోతైన ప్రదేశం.
Also Read: రాగి పాత్రలతో ఉపయోగాలు..