టీటా ఆధ్వర్యంలో శిల్పారామం వద్ద బోనాల జాతర

367
Bonalu
- Advertisement -

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామం వద్ద బోనాల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ , టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాల హాజరయ్యారు. ఈ బోనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గోన్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుల్లతో ఆకట్టుకున్నారు. వారితో కలిసి ఐటీ ఉద్యోగులు స్టెప్లు లేశారు.

ఈసందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులతో బోనాల నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. టీటా సమాజబాధ్యతతో ముందుకు సాగుతోందన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ స్కూల్స్ గా మార్చారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న టీటా కు అభినందనలు తెలిపారు.

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుండి ఐటీ సెక్టార్ లో బోనాలు నిర్వహిస్తున్నాం అని చెప్పారు. ఉద్యమ కాలంలో ఇక్కడ బోనాలు నిర్వహించి అరెస్టయ్యం.. ఇప్పుడు ఇక్కడే గర్వంగా బోనాల జాతర నిర్వహించుకుంటున్నాం అని తెలిపారు. ఐటీ ఉద్యోగలందిరితో బోనాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -