కళియుగ వైకుంఠం తిరుపతి పుట్టినరోజు రోజు నేడు. శ్రీ మహా విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో తిరుపతి ఒకటి. రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న అద్భుతం జరిగింది. శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు గోవిందరాజ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారని ప్రసిద్ధి. అదే ఇప్పుడు తిరుపతి పట్టణంగా అభివృద్ధి చెందడానికి నాంది పలికింది.
ప్రస్తుత టీటీడీపీ ఛైర్మన్,స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం లోపల కనుగొనబడిన పురాతన శాసనాలను ప్రస్తావించారు. ఇది రామానుజాచార్యుల వారు ఫిబ్రవరి 24 న ఆలయ నగరాన్ని స్థాపించినట్లు రుజువు చేసింది. రామానుజ పురం గా పిలవబడటానికి ముందు “గోవిందరాజ పట్టణం అని పేరు పెట్టబడిందని వెల్లడైంది.
అందుకే తిరుపతి నగర వాసులను భాగస్వామ్యం చేస్తూ మానస వికాస వేదిక గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఈరోజు అర్చకులు, మేళతాళాలు వివిధ కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పుట్టినరోజు పండుగ వేడుకగా జరుపనున్నారు.
Also Read:IND vs ENG :టీమిండియా చేసిన తప్పు అదే!