- Advertisement -
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 64,823 మంది దర్శించుకోగా 22,890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోండగా హుండి ద్వారా ఆదారం రూ. 3.03 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇక ఇవాళ అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
- Advertisement -