- Advertisement -
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరొజు సర్వదర్శనం కంపార్టమెంట్లన్నీ నిండి వెలుపల కూడా భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తుల తో కంపార్టమెంట్ లన్నీ నిండి వెలుపల కూడా భక్తులు వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 12 గంటల సమయం పడుతుంది. నిన్న అక్టోబర్ 13 న స్వామివారిని 75,700 మంది భక్తులు ధర్శించుకున్నారు. నిన్న 44,607 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిచి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.93 కోట్లు
- Advertisement -