TTD: తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

1
- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో  జె.శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గురువారం సాయంత్రం ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన పంచ‌మి తీర్థం రోజు భ‌క్తుల‌కు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్ల‌లో ఉండే వేచి ఉండే భక్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మ‌రుగుదొడ్ల‌ను కూడా అందుబాటులో ఉంచేందుకు ముంద‌స్తుగానే ప్ర‌ణాళిక చేసుకోవాల‌న్నారు. హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు.

ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని స్థానిక పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. వైద్య విభాగం అధికారులు ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాల‌ను, అంబులెన్సుల‌ను ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాల‌ను, అవ‌స‌ర‌మైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశాంచారు.

Also Read;డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు

భ‌క్త‌లంద‌రికీ అన్న‌ప్ర‌సాదం విరివిగా అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా నిర్వ‌హించే స్టేజ్ కార్య‌క్ర‌మాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నాణ్య‌మైన‌విగా ఉండాల‌ని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో వైట్ వాష్‌, క‌ల‌ర్ పెయింటింగ్‌, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ముఖ్య‌మైన ప్రాంతాల్లో ఆర్చిలు ఏర్పాటు చేసి హారితి పాయింట్స్ కోసం లైన్ లు, బారికేడ్లు, చైన్ లింక్ ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుచానూరులో ఫ‌ల‌, పుష్ఫ ప్ర‌ద‌ర్శ‌న‌ను భ‌క్తులు ఆక‌ట్టుకునేలా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

- Advertisement -