చలికాలం పూర్తవుతోంది. ఎండలు మొదలవుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్ది చెమట రావడం సహజం. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ చెమట సమస్య అందరినీ బాధిస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది తద్వారా హార్మోన్ల అసమతుల్యం ఏర్పడి ఎకృన్ గ్రంధుల కారణంగా చెమట వస్తుంది. చెమట కారణంగా దుర్వాసన రావడం వల్ల నలుగురిలో ఉండేందుకు ఇబ్బంది పడుతుంటారు. కొందరు రకరకాల పెర్ఫ్యూమ్ లు, సువాసన కలిగించే బాడీ స్ప్రే లు వాడుతుంటారు. అయితే ఈ ఈ బాడీ స్ప్రేలకు చెమట తోడవడంతో మరింత దుర్వాసన ఏర్పడుతుంది. అందువల్ల ఎండాకాలంలో చెమట సమస్యను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు అద్బుతంగా పని చేస్తాయి. అవేంటో చూద్దాం..! .
కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. దీనిని చెమట ఎక్కువగా ఏర్పడే ప్రదేశాలలో అప్లై చేయాలి. ఒక ఐదు లేదా పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా చెమట కారణంగా ఏర్పడే బ్యాక్టీరియాను కూడా ఇది నిర్మూలిస్తుంది. ఒక లీటర్ వేడి నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగులును వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని చెమట పట్టే ప్రదేశాలలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చెమటను తగ్గించడంలో సహాయ పడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కరిగించి చెమట వచ్చే ప్రదేశాలలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా చనిపోయి.. దుర్వాసన రాదు. ఇంకా మనం తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ నీరు ఎక్కువగా తాగడం వల్ల అధిక చెమట నుంచి బయటపడవచ్చు.
Also Read:ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?