మొబైల్ డేటాను సేవ్ చేసే సూపర్ టిప్స్!

45
- Advertisement -

నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొబైల్ వాడకం తగ్గట్టుగా మనం రిచార్జ్ చేయిస్తూ ఉంటాము. ఆన్లైన్ లో ఎక్కువ సమయం గడిపే వారు రోజుకు 2 జిబి లేదా 3 జిబి డేటా ప్లాన్ వాడుతూ ఉంటారు. ఇకా మొబైల్ పెద్దగా యూస్ చేయని వారు 1 జిబి లేదా 1.5 జిబి డేటా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అయితే 1 జిబి లేదా 1.5 జిబి డేటా ప్లాన్ వాడే వారికి రోజంతా డేటా వాడడం కష్టమే. ఎందుకంటే మన కొద్దిగా టైమ్ దొరికిన వీడియోస్ చూడడం లేదా ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంటివి చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల ఏదైనా అర్జెంట్ అవసరం పని ఉన్నప్పుడూ అనగా ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు లేదా ముఖ్యమన సమాచారం వాట్సప్ ద్వారా పంపించాల్సి వచ్చినప్పుడు సమయానికి డేటా ఉండదు. దాంతో మళ్ళీ ప్రత్యేకంగా డేటా రిచార్జ్ చేయించాల్సి వస్తుంది. ఇలా దాంతో మనం వ్యర్థంగా డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే మన మొబైల్ లోని కొన్ని టిప్స్ పాటించడం వల్ల మొబైల్ డేటా చాలావరకు సేవ్ అవుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా !

సాధారణంగా మన మొబైల్ లో చాలా రకాల యాప్స్ నే ఉపయోగిస్తూ ఉంటాము. అయితే కొన్ని యాప్స్ ఎలాంటి అవసరం లేకుండానే మొబైల్ లో ఇన్స్టాల్ అయి ఉంటాయి. అలాంటి యాప్స్ కొన్ని ఆన్ ఇన్స్టాల్ చెడ్డమంటే సాధ్యం కాదు. ఈ యాప్స్ మనకు తెలియకుండానే మొబైల్ బ్యాక్ గ్రాండ్ లో రన్ అవుతూ డేటా మొత్తం కంజూమ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యాప్స్ ను లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళాలి అక్కడ ” force stop ” అనే ఆప్షన్ ఉంటుంది.

Also Read:రక్షిత్ అట్లూరి…నరకాసుర

దీనిని క్లిక్ చేస్తే ఆ యాప్ బ్యాక్ గ్రాండ్ లో రన్ అవ్వకుండా ఆగిపోతుంది. ఇక మనకు అవసరం ఉన్న కొన్ని యాప్స్ కూడా మనకు తెలియకుండా డేటా కంజూమ్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు యాప్ సెట్టింగ్ లోకి వెళ్ళి ” allow deta background ” అనే ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. ఇక ప్రతిఒక్కరిలో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. ఇందులో మనకు తెలియకుండానే మన మొబైల్ లోని యాప్స్ అన్నీ ఆటోమేటిక్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఆటో అప్డేట్ కాకుండా మ్యానువల్ అప్డేట్ ను సెట్ చేసుకోవాలి. ఇంకా గూగుల్ ఫోటోస్ యాప్ లో ఫోటోస్ మరియు వీడియో ఆటో బ్యాకప్ కాకుండా ఆఫ్ చేసుకోవాలి. వాట్సప్ లో కూడా ఆటో బ్యాకప్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మొబైల్ డేటా చాలా వరకు సేవ్ అవుతుంది.

Also Read:శర్వాకు జోడిగా కృతి శెట్టి..

- Advertisement -